: క్వాలిటీ కావాలి...లేదంటే బ్లాక్ లిస్ట్ లో పెడతాం!: చంద్రబాబు హెచ్చరిక


కృష్ణా పుష్కరాల పనుల్లో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. కర్నూలు కలెక్టరేట్‌ లో కృష్ణా పుష్కరాల పనులపై సమీక్ష నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గడువులోగా పుష్కరాల పనులు పూర్తి కావాలని అన్నారు. గడువులోగా పనులు పూర్తి చేయలేకపోయినా, నాణ్యత లోపించినా సదరు కంపెనీలను బ్లాక్ లిస్టులో పెడతామని ఆయన హెచ్చరించారు. పనులు పర్యవేక్షించిన అధికారులపై కూడా చర్యలుంటాయని ఆయన తెలిపారు. కృష్ణా పుష్కరాల్లో భక్తుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పిన ఆయన, సీసీ కెమెరాలు, డ్రోన్ల సాయంతో భద్రతను పర్యవేక్షించాలని సూచించారు. పుష్కరాలను పురస్కరించుకుని యాగంటి, అహోబిలం ఆలయాలను అభివృద్ధి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.

  • Loading...

More Telugu News