: ర‌మ్య కుటుంబానికి జరిగిన న‌ష్టంపై కేసీఆర్ ఆవేద‌న వ్యక్తం చేశారు: మ‌ంత్రి త‌ల‌సాని


ఇటీవ‌ల రోడ్డు ప్ర‌మాదంలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారి రమ్య కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి కేసీఆర్‌తో స‌మావేశ‌ప‌రుస్తామ‌ని తెలంగాణ‌ మ‌ంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈరోజు ర‌మ్య తాత‌య్య మ‌ధుసూద‌నాచారి మృత‌దేహాన్ని య‌శోద ఆసుప‌త్రి నుంచి ఉస్మానియా ఆసుప‌త్రి మార్చురీకి త‌ర‌లించిన అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. చిన్నారి ర‌మ్య కుటుంబానికి తీర‌ని న‌ష్టం జ‌రిగింద‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆవేద‌న వ్యక్తం చేసిన‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. ప్ర‌మాదానికి కార‌ణ‌మైన వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఆయ‌న తెలిపారు. ఇటువంటి ఘ‌ట‌న‌లు మ‌ళ్లీ జ‌ర‌గ‌కుండా అన్ని చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఆయ‌న చెప్పారు.

  • Loading...

More Telugu News