: గాంధీ భవన్‌లో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తాం, ప్రభుత్వ తీరుని ఎండగడతాం: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తోన్న ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వడానికి రాష్ట్ర కాంగ్రెస్ సిద్ధమవుతోంది. హైదరాబాద్‌లో ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఈ విషయాన్ని తెలిపారు. ఈనెల 23న సాగునీటి ప్రాజెక్టులపై గాంధీభవన్‌లో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తామని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టుల రీడిజైనింగ్ చేసిందని, దానిలోని అశాస్త్రీయతను గురించి ప్రజలకి తెలియజేస్తామని ఆయన అన్నారు. ప్రాజెక్టులపై డీపీఆర్ ఇవ్వాలని కోరితే ప్రభుత్వం నుంచి స్పందన రాలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.