: డైరెక్టర్ యోగి అసభ్యంగా ప్రవర్తించాడని హీరోయిన్ అనుకృతి ఫిర్యాదు
'పాప' చిత్రం హీరోయిన్ అనుకృతి, డైరెక్టర్ యోగిల మధ్య నెలకొన్న వివాదం మరింత పెద్దదైంది. యోగి తనతో అసభ్యంగా ప్రవర్తించాడని అనుకృతి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు ముందుగా చెప్పని ఎన్నో సీన్లను చిత్రంలో జోడించాడని, అసభ్య సన్నివేశాల్లో నటించనని చెప్పగా, వేధించాడని అంటోంది. అంతకుముందు, చిత్రం స్క్రిప్టు మొత్తం చూసి, డైలాగులన్నీ తెలుసుకుని, నటించేందుకు అంగీకరించిన అనుకృతి, ఆపై మధ్యలో అర్థాంతరంగా తప్పుకుందని యోగి ఆరోపించిన సంగతి తెలిసిందే. చిత్రం 60 శాతం పూర్తయిందని, ఈ నేపథ్యంలో మరింత రెమ్యునరేషన్ కోసం ఆమె కొత్త నాటకానికి తెర లేపిందని యోగి బంజారాహిల్స్ పీఎస్ లో ఫిర్యాదు చేశాడు. వీరిద్దరి ఫిర్యాదులనూ అందుకున్న పోలీసులు నేడు అనుకృతిని స్టేషన్ కు పిలిపించి విచారించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.