: కేబినెట్ తీర్మానం ద్వారా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వొచ్చు: రఘువీరా
ఆంధప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన బీజేపీ నేతల హామీలు ఏమయ్యాయని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఈరోజు ప్రశ్నించారు. హోదా అంశాన్ని చట్టంలో పెట్టాల్సిన అవసరం లేదని, కేబినెట్ తీర్మానం ద్వారా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వొచ్చని ఆయన అన్నారు. గతంలో ఎన్నో రాష్ట్రాలకు కేబినెట్ తీర్మానం ద్వారానే హోదా ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. హోదాపై కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బహిరంగ చర్చకు సిద్ధమా? అని ఆయన సవాలు విసిరారు. విజయవాడలో ఆలయాల కూల్చివేతను తాము ఖండిస్తున్నట్లు రఘువీరా తెలిపారు. ఏపీ కేబినెట్లో సమర్థవంతమైన మంత్రులు లేరని ఆయన వ్యాఖ్యానించారు.