: ఈ మధ్యాహ్నం మోదీ, అరుణ్‌జైట్లీ లతో కేసీఆర్ భేటీ
ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు బిజీబిజీగా ఉన్నారు. ఈరోజు మధ్యాహ్నం 12.40 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన భేటీ అవుతారు. అనంతరం 1.15 కి ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీని ఆయన కలుస్తారు. భేటీలో తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న అంశాలపై కేసీఆర్ కీలక చర్చలు జరపనున్నారు. ఇటీవల న్యాయవాదులు ఉమ్మడి హైకోర్టు విభజనపై జరిపిన ఆందోళనను ఆయన కేంద్రమంత్రులతో చర్చించనున్నట్లు సమాచారం. తెలంగాణకు రావాల్సిన నిధులు, పలు అంశాలపై ఆయన చర్చిస్తారు.