: మంచినీళ్లు అనుకొని కిరోసిన్ తాగిన చిన్నారి.. మృతి


రెండేళ్ల చిన్నారి మంచినీళ్లు అనుకొని కిరోసిన్ తాగి మృతి చెందిన ఘ‌ట‌న కర్నూలు జిల్లా కోవెలకుంట్లలోని వ‌ల్లంపాడు గ్రామంలో జ‌రిగింది. ఈరోజు ఉద‌యం ఆ బాలుడి త‌ల్లిదండ్రులు నాగార్జున, మేరమ్మ త‌మ ప‌నుల్లో మునిగి ఉండ‌గా ఒంట‌రిగా ఉన్న ఆ చిన్నారి కిరోసిన్ తాగాడు. దీంతో కొద్ది సేప‌టికే మృతి చెందాడు. చిన్నారి మృతితో స్థానికంగా విషాద‌ఛాయ‌లు అల‌ముకున్నాయి. బాలుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

  • Loading...

More Telugu News