: పవన్ కల్యాణ్‌పై నిప్పులు చెరిగిన ఏపీ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
జనసేన వ్యవస్థాపకుడు, సినీనటుడు పవన్ కల్యాణ్‌పై ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డేరంగుల ఉదయ్‌కిరణ్ నిప్పులు చెరిగారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని, ప్రభుత్వం నుంచి అందాల్సిన సంక్షేమ పథకాలు తమకి లభించడం లేదని ప్రజలు ఆవేదన చెందుతుంటే పవన్ కల్యాణ్ ఏం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన పార్టీని స్థాపించే సమయంలో ప్రజల పక్షాన పోరాడతానని జనసేన అధినేత గొప్పలు చెప్పుకున్నారని, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీరుపై స్పందించకపోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు. పవన్ స్థాపించిన జనసేన పార్టీని ఎన్నికల సంఘం రద్దు చేయాలని, ఆ పార్టీ అధినేత ప్రజల పక్షాన పోరాటం చేయడం లేదని డేరంగుల ఉదయ్‌కిరణ్ వ్యాఖ్యానించారు. జనసేన అధినేత ఇప్పుడు ఎక్కడున్నారంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారని అన్నారు. పవన్ తన భార్యకు, పుట్టిన బిడ్డకు కూడా న్యాయం చేయలేదని, అలాంటిది ప్రజలకు ఏమి న్యాయం చేస్తారని ఆయన వ్యాఖ్యానించారు.