: విజయ్ మాల్యాలా చేసి అడ్డంగా దొరికిపోము: ఎయిర్ ఆసియా సీఈఓ


భారత పౌర విమానయాన రంగంలో కింగ్ ఫిషర్ దూసుకువచ్చినట్టుగా తాము విస్తరణ, అభివృద్ధి ప్రణాళికలను రూపొందించుకోవడం లేదని ఎయిర్ ఆసియా చీఫ్ టోనీ ఫెర్నాండెజ్ వ్యాఖ్యానించారు. భారత్ లోని రక్షణాత్మక ధోరణి, ప్రభుత్వ విధానాలు మరింత అభివృద్దికి సహకరించేలా లేవని, విమానయాన రంగంలో ప్రభుత్వం చెబుతున్న దానిలో 80 శాతం అమలు చేసినప్పుడే అనుకున్నది సాధించగలుగుతామని అన్నారు. కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యాలా తాము ఆలోచించడం లేదని, సత్వర వృద్ధి తమ అజెండాలో లేదని ఆయన స్పష్టం చేశారు. నిదానంగా స్థిరమైన వృద్ధితో ముందుకు వెళ్లడానికే ప్రాధాన్యమిస్తున్నామని తెలిపారు. భారత పౌరవిమానయాన రంగం 100 మీటర్ల రేసుకాదని, డబుల్ మారధాన్ వంటిదని అభిప్రాయపడ్డ ఫెర్నాండెజ్, "విజయ్ మాల్యాలా మార్కెట్ బుల్ మాదిరిగా ప్రవర్తించి దొరికిపోవాలని భావించడం లేదు. ప్రభుత్వ విధానం ఇంకా అస్పష్టంగా ఉంది. మరికొన్ని సంవత్సరాలు ఇలాగే ఉంటుందని భావిస్తున్నాం. ప్రతిపాదనల్లో 80 శాతం అమలు కావాల్సి వుంది. ఇండియాలో వ్యాపారం అనుకున్నంత సులువేమీ కాదు. 5/20 రూల్ తొలగించడంతో ఈ రంగంలో విస్తరణకు తొలి అడుగు పడింది" అని అన్నారు.

  • Loading...

More Telugu News