: డొనాల్డ్ ట్రంప్ కు వ్యతిరేకంగా మహిళల వినూత్న ప్రదర్శన
అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కు వ్యతిరేకంగా వందమందికిపైగా మహిళలు అద్దాలు చేతబట్టి నగ్నంగా ఫొటోలకు పోజులిచ్చారు. ఫొటోగ్రాఫర్ స్పెన్సర్ ట్యునిక్ పిలుపు మేరకు వారు ఇలా ఒంటిపై నూలు పోగు లేకుండా ఫొటోలు దిగారు. ‘‘ఆయనో పరాజితుడు’’ అని ట్రంప్ ను ఉద్దేశించి పేర్కొన్న ట్యునిక్ ఈ ఫొటోను నంబరు 8 ఎన్నికలకు ముందు ఆవిష్కరించనున్నట్టు పేర్కొన్నారు. ఈ మొత్తం ఫొటో షూట్ లో 130 మంది మహిళలు పాల్గొన్నారు. నేడు రిపబ్లికన్ కన్వెన్షన్ జరగనున్న క్లీవ్ లాండ్ లోనే ఈ ఫొటో షూట్ నిర్వహించడం గమనార్హం. ఇక్కడ బహిరంగ నగ్న ప్రదర్శన చట్టవిరుద్ధం. అయినా తాను ఫొటో షూట్ నిర్వహించిన ప్రాంతం యజమాని అందుకు అంగీకరించినట్టు ట్యునిక్ చెప్పుకొచ్చారు. తాను ఇప్పటి వరకు రాజకీయాలకు సంబంధించి ఫొటో షూట్ నిర్వహించలేదన్న ట్యూనిక్.. నవంబరులో జరగనున్న ఎన్నికల్లో ట్రంప్ కు వ్యతిరేకంగా ఓటేయాలని ప్రజలను అభ్యర్థించారు.