: ధావన్ జరిమానా వేస్తే... పుజారా వసూలు చేస్తాడు!


భారత కోచ్ గా అనిల్ కుంబ్లే బాధ్యతలు స్వీకరించిన అనంతరం, ముందుగా క్రమశిక్షణపై దృష్టిని సారించి, శిక్షణకు అలస్యంగా వస్తే, సుమారు రూ. 3,300 జరిమానా చెల్లించాల్సి వుంటుందని చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జరిమానాల విధింపు, డబ్బులు వసూలు కోసం ఆటగాళ్లతోనే ఓ కమిటీని ఏర్పాటు చేశాడు కుంబ్లే. ఫిర్యాదులన్నీ శిఖర్ ధావన్ పరిశీలిస్తాడని, జరిమానాల వసూలు బాధ్యతలను పుజారాకు అప్పగించాలని ఆదేశించాడు. వీరిద్దరికీ పైన కమిటీ చైర్మన్ గా భువనేశ్వర్ కుమార్ ఉంటాడని స్పష్టం చేశాడు. కాగా, జరిమానా విధానం అమల్లోకి వచ్చిన తరువాత ఏ ఆటగాడు కూడా నిబంధనలు ఉల్లంఘించలేదని భువనేశ్వర్ వెల్లడించాడు. ఇక జరిమానాల రూపంలో వసూలైన డబ్బును చారిటీ సంస్థకు ఇవ్వాలని భావిస్తున్నామని తెలిపాడు.

  • Loading...

More Telugu News