: కశ్మీర్ లో కొనసాగుతున్న ఉద్రికత్త.. తాజాగా మరొకరు మృతి.. అదనపు బలగాలను పంపించిన కేంద్రం


కశ్మీర్ లోయలో ఉద్రిక్తత ఇంకా కొనసాగుతూనే ఉంది. హిజ్బుల్ ఉగ్రవాది బుర్హాన్ వనీ ఎన్ కౌంటర్ తర్వాత చెలరేగిన ఆందోళనలు ఇంకా చల్లారలేదు. తాజాగా ఆదివారం ఉత్తర కశ్మీర్ లోని బండీపొరా జిల్లాలో ఓ ఆర్మీ క్యాంపుపై దుండగులు దాడికి దిగారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురు గాయపడ్డారు. ఉద్రిక్త వాతావరణాన్ని చల్లబరిచేందుకు కేంద్రం 2 వేలమంది సీఆర్ పీఎఫ్ సిబ్బందిని కశ్మీర్ పంపించింది. గతవారం 2,800 మంది సీఆర్ పీఎఫ్ సిబ్బందిని రాష్ట్రానికి పంపించిన విషయం తెలిసిందే. ఇక కశ్మీర్ లోయ వ్యాప్తంగా ఆదివారం కూడా కర్ఫ్యూ కొనసాగింది. బారాముల్లా, శ్రీనగర్ లోని ఈద్గాలలో అల్లరి మూకలు భద్రతా సిబ్బందిపై రాళ్లు రువ్వాయి. స్థానిక మసీదుల నుంచి భారత వ్యతిరేక, పాకిస్థాన్ అనుకూల నినాదాలు వినిపించాయి. మొత్తం పది జిల్లాల్లోనూ కర్ఫ్యూ కొనసాగుతోందని, శాంతిభద్రతలను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News