: స్టేజ్ కూలిన సంఘటనలో కాంగ్రెస్ నేత షీలా దీక్షిత్ కు గాయాలు
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షీలా దీక్షిత్ కు గాయాలయ్యాయి. లక్నోలో రోడ్ షో నిమిత్తం ఒక ట్రక్కుపై ఏర్పాటు చేసిన స్టేజ్ కూలిపోవడంతో ఆమెకు గాయాలయ్యాయి. యూపీ కాంగ్రెస్ నేత రాజ్ బబ్బర్ తో కలిసి ఈ రోడ్ షో నిర్వహించారు. స్టేజ్ కూలిన సంఘటనలో షీలా దీక్షిత్ స్వల్పంగా గాయపడ్డారని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు.