: గుజరాత్ ను విడిచిపెట్టిన హార్దిక్ పటేల్


పటేళ్ల నేత హార్దిక్ పటేల్ ఈరోజు గుజరాత్ విడిచి వెళ్లారు. వచ్చే ఆరు నెలల వరకు రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే పుష్కరాల పటేల్ ఇంట్లో ఆయన వుంటారు. ఈ సందర్భంగా హార్దిక్ కు ఆయన మద్దతుదారులు ఘనంగా వీడ్కోలు పలికారు. కాగా, పటేళ్ల రిజర్వేషన్లు కోరుతూ చేపట్టిన ఉద్యమ నేపథ్యంలో చెలరేగిన ఆందోళనలు తీవ్ర రూపం దాల్చడం, హార్దిక్ ను అరెస్టు చేయడం తెలిసిందే. దీనిపై విచారణ చేసిన గుజరాత్ హైకోర్టు, హార్దిక్ ఆరు నెలల పాటు రాష్ట్రం విడిచి వెళ్లాలనే షరతుతో బెయిల్ ను మంజూరు చేసింది.

  • Loading...

More Telugu News