: ‘మెగా’ ఫ్యామిలీ హీరోకు కేటీఆర్ ప్రశంస


‘మెగా’ ఫ్యామిలి హీరో వరుణ్ తేజ్ పై తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. క్రిష్ దర్శకత్వం వహించిన ‘కంచె’ చిత్రం తాను చూశానని, చాలా అద్భుతంగా ఉందని అన్నారు. ఈమేరకు కేటీఆర్ ఒక ట్వీట్ చేశారు. ఈ చిత్రం చాలా క్వాలిటీగా ఉందని, వరుణ్ తేజ్, ప్రగ్యా జైశ్వాల్ నటన చాలా బాగుందంటూ ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. కాగా, ‘కంచె’ జాతీయ ఉత్తమ చిత్రం అవార్డు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News