: ఎవరూ ఊహించని విధంగా గంజాయి అక్రమ రవాణ
ఎవరూ ఊహించని విధంగా గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. గంజాయిని సాధారణ మార్గాల్లో తరలిస్తే పోలీసులకు పట్టుబడతామని ఆలోచించిన మాయగాళ్లు, అంబులెన్స్ లో అక్రమ రవాణాకు పాల్పడితే ఎవరీకి అనుమానం రాకుండా ఉంటుందని భావించిన వారి పన్నాగాన్ని పోలీసులు భగ్నం చేశారు. అంబులెన్స్ లో తరలిస్తున్న 190 కిలోల గంజాయిని విశాఖ సమీపంలోని నర్సీపట్నం వద్ద నిన్న పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.