: దాడికి పాల్పడిన ఉగ్రవాది ఒక పిచ్చి కుక్కంటూ మండిపడ్డ మతపెద్ద
ఫ్రాన్స్ లోని నీస్ లో దాడికి పాల్పడ్డ ఉగ్రవాది పిచ్చకుక్కతో సమానమంటూ షియా మతపెద్ద మౌలానా కాబి సాదిక్ మండిపడ్డారు. లక్నోలోని ఒక మెడికల్ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ‘ఉగ్రవాదం’ అనే అంశంపై మౌలానా కాబి సాదిక్ మాట్లాడుతూ, ‘ఉగ్ర’ దాడి ఘటనలో అమాయకులు బలైపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. మానవత్వాన్ని దెబ్బతీసే ఎలాంటి చర్యలకైనా ముస్లింలు దూరంగా ఉండాలని, ప్రపంచంలోని ముస్లింల జీవితాలను బాగుచేసేది ఒక్క విద్యేనని, ప్రతి ముస్లిం విద్యావంతుడవ్వాలని సాదిక్ అన్నారు. ‘భారత్ మాతాకు జై’ అనేందుకు ఇష్టపడని ముస్లింలు ‘భారత్ అమ్మికీ జై’ అని అనాలంటూ హితవు పలికారు.