: మల్లన్న చెంతకు చంద్రన్న!


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రేపు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ను సాధారణ పరిపాలనా శాఖ విడుదల చేసింది. రేపు ఉదయం శ్రీశైలం చేరుకునే చంద్రబాబు, తొలుత మల్లన్నను దర్శించుకోనున్నారు. ఆ తరువాత భ్రమరాంబను దర్శించుకుని, అక్కడి నుంచి పాతాళగంగకు వెళతారు. అక్కడ పుష్కరాలకు జరుగుతున్న ఏర్పాట్లను, ఘాట్ల పరిస్థితులను పరిశీలిస్తారు. లోపాలుంటే, వాటిపై అధికారులకు అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేస్తారు. అనంతరం పుష్కరాలు జరిగే రోజుల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలూ కలుగకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చలు జరుపుతారు.

  • Loading...

More Telugu News