: 'అనవసరంగా హాకీ ఆడానేమో' అంటూ రీతూ రాణి విలాపం!


తాను హాకీ క్రీడను ఎంచుకుని జీవితంలో పెద్ద తప్పు చేశానని భావిస్తున్నట్టు, భారత హాకీ మహిళల జట్టు మాజీ కెప్టెన్ రీతూ రాణి వ్యాఖ్యానించింది. ఇన్ని సంవత్సరాలూ అనవసరంగా హాకీని ఆడినట్టు విలపిస్తూ చెప్పింది. రియోకు భారత జట్టును ఎంపిక చేసిన వేళ, రీతూను కెప్టెన్ పదవి నుంచి తొలగించి, ఆపై జట్టుకు కూడా ఎంపిక చేయని సంగతి తెలిసిందే. రియోకు భారత్ క్వాలిఫై కావడం వెనుక ఎంతో శ్రమపడ్డ రీతూ, ప్రస్తుతం హాకీ ఇండియా అధికారులపై మండిపడుతోంది. తాను ఫామ్ కోల్పోయినట్టు, సరైన ప్రవర్తనతో లేనట్టు నిరాధార నిందలు మోపారని కన్నీటితో పేర్కొంది. తనను ఎందుకు దూరం పెట్టారో ఇప్పటివరకూ చెప్పలేదని అంది. హాకీలో స్త్రీల పట్ల వివక్ష చూపుతున్నారని ఆరోపించింది.

  • Loading...

More Telugu News