: అమెరికాలో గ్రీన్ కార్డుతో ఉంటూ, టర్కీలో తిరుగుబాటుకు కారణమైన ఫెతుల్లా గులెన్, అప్పగించేందుకు యూఎస్ మెలిక!


టర్కీలో ఎర్డోగాన్ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న సైనిక కుట్ర వెనుక అమెరికాలోని పెన్సిల్వేనియా పరిధిలోని పెకనాస్ పర్వత ప్రాంతంలో గ్రీన్ కార్డుతో నివసిస్తున్న ముస్లిం ప్రబోధకుడు ఫెతుల్లా గులెన్ కారణమని టర్కీ విమర్శిస్తోంది. ఆయనే సైనికుల్లో కొందరు అధికారుల మనసు మార్చి తిరుగుబాటు చేయించారని, ఆయన్ను తక్షణం తమ దేశానికి అప్పగించాలని ఎర్డోగాన్ డిమాండ్ చేయగా, అందుకు ఆధారాలు చూపాలని అమెరికా సర్కారు మెలిక పెట్టింది. ఫెతుల్లా గులెన్ ప్రమేయంపై సరైన ఆధారాలు చూపిస్తేనే ఆయన్ను టర్కీకి డిపోర్ట్ చేస్తామని స్పష్టం చేసింది. సున్నీ ముస్లిం నేత సయ్యద్ నుర్సీ శిష్యుడైన గులెన్, 'హిజ్మత్' (టర్కీ భాషలో సేవ) పేరిట ఓ ఉద్యమాన్ని నిర్వహిస్తూ, ఇస్లాం ప్రబోధకుడిగా ఉన్నారు. 2013 వరకూ ఎర్డోగాన్ సన్నిహితుడిగానే ఉన్న గులెన్, ఆపై అధ్యక్షుడిపై వచ్చిన అవినీతి ఆరోపణలతో దూరం జరిగారు. ఆపై గులెన్ అమెరికాలో తలదాచుకోగా, అతన్ని అప్పగించాలని టర్కీ చానాళ్లుగా డిమాండ్ చేస్తూనే ఉంది. తమ నేత కేవలం పౌర నిరసనలకు మాత్రమే పిలుపునిచ్చారని, సైనికుల తిరుగుబాటు వెనుక ఆయన లేరని గులెన్ అనుయాయులు అంటున్నారు.

  • Loading...

More Telugu News