: జయలలితను కించపరిచిన కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యే కోర్టులో లొంగుబాటు


తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను కించపరుస్తూ మాట్లాడిన కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయతరణి కోర్టులో లొంగిపోయారు. జయలలిత తరఫున వేసిన పరువు నష్టం దావాపై విచారణకు పలుమార్లు హాజరు కాని విజయతరణి, కోర్టు నాన్ బెయిలబుల్ వారంట్ ను జారీ చేసే సరికి కోర్టుకు వచ్చారు. గత సంవత్సరం సెప్టెంబర్ లో విజయతరణి ప్రసంగిస్తూ, జయలలితపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై కేసు నమోదు కాగా, జూన్ 15న జరగాల్సిన విచారణకు ఆమె రాలేదు. దీంతో న్యాయమూర్తి సదిక్కుమార్ ఎన్బీడబ్ల్యూ జారీ చేస్తూ, కేసును వాయిదా వేశారు. ఈ నేపథ్యంలోనే విజయతరణి కోర్టులో లొంగిపోయి తనపై వచ్చిన వారెంటును రద్దు చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తనపై రాజకీయ కక్ష సాధింపు జరుగుతోందని ఆరోపించారు.

  • Loading...

More Telugu News