: ఏపీలో 33 మంది డీఎస్పీల బదిలీ


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీసు ఆఫీసర్లను భారీ ఎత్తున స్థాన చలనం చేసింది. 33 మంది డీఎస్పీలను ప్రభుత్వం బదిలీ చేసింది. ఇంత పెద్దమొత్తంలో బదిలీలు చేపట్టడం ఆసక్తి రేపుతోంది. రాష్ట్ర విభజన అనంతరం పోలీసు ఉన్నతాధికారుల్లో ఇంత భారీ ఎత్తున బదిలీలు చేపట్టడం ఇదే ప్రధమం. కాగా, విజయవాడ టాస్క్‌ ఫోర్స్‌ డీఎస్పీగా రాజీవ్‌ కుమార్‌, విజయవాడ (క్రైం) డీఎస్పీగా వీఎస్‌ఎన్‌ వర్మ, నెల్లూరు సీసీఎస్‌ డీఎస్పీగా బాలచందర్‌ రావు, తిరుపతి అర్భన్‌ (ట్రాఫిక్‌) డీఎస్పీగా రమణకుమార్‌ ను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

  • Loading...

More Telugu News