: కాశ్మీర్ లో మళ్లీ చెలరేగిన హింస


గత రెండు రోజులుగా ప్రశాంతంగా ఉందని భావించిన జమ్ము, కశ్మీర్ లో మళ్లీ అల్లర్లు చెలరేగాయి. హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాది బుర్హాన్ వనీ ఎన్ కౌంటర్ తో జమ్మూకాశ్మీర్ లో అల్లర్లు చెలరేగిన సంగతి తెలిసిందే. నేటి మధ్యాహ్నం కుప్వారా జిల్లాలో భద్రత బలగాలకు, ఆందోళనకారులకు మధ్య ఘర్షణ చెలరేగింది. ఆయుధాలు స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా ఆందోళనకారులు పోలీస్ స్టేషన్ పై దాడి చేయడంతో పోలీసులు ప్రతిఘటించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఆందోళనకారులను అదుపుచేసే క్రమంలో జరిగిన ప్రతిఘటనలో ఒకరు మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు. కాగా దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది.

  • Loading...

More Telugu News