: జైట్లీ చేతుల మీదుగా ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకున్న 'సూపర్ 30' ఆనంద్


లక్ష్మీపత్ సింఘానియా-ఐఐఎం లక్నో నేషనల్ లీడర్ షిప్ అవార్డును 'సూపర్ 30' ఆనంద్ అందుకున్నారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ అవార్డును కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ చేతుల మీదుగా ఆనంద్ అందుకున్నారు. వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభ ప్రదర్శించిన వారిని ఈ అవార్డు వరిస్తుంది. గతంలో ఈ అవార్డును అజీం ప్రేమ్ జీ, నారాయణమూర్తి, రతన్ టాటా వంటి వారు అందుకున్నారు. గణితశాస్త్ర నిపుణుడైన సూపర్ 30 ఆనంద్‌, 2002 నుంచి ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ)లో సీటు సంపాదించాలనే కోరిక ఉన్న పేద విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటివరకు వందలాది విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. అలా శిక్షణ పొందిన విద్యార్థులు ఐఐటీల్లో సీటు సంపాదించుకున్నారు. దీంతో ఆయనకు ఈ అవార్డును అందజేశారు. ఈ అవార్డు తనపై మరింత బాధ్యత పెంచిందని, అదే సమయంలో చురుగ్గా పనిచేసేందుకు అవసరమైన ఉత్సాహాన్నిచ్చిందని అన్నారు.

  • Loading...

More Telugu News