: టర్కీలో ఉన్న భారతీయుల గురించి ఆందోళన వద్దు: సుష్మా స్వరాజ్
ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ప్రయత్నిస్తూ టర్కీలో సైనికులు తిరుగుబాటు చేసిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో అక్కడి భారతీయుల సమాచారంపై విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ స్పందించారు. ఆ దేశంలో ఉన్న భారతీయులు క్షేమంగా ఉన్నట్లు ఆమె ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అక్కడి భారతీయుల పరిస్థితి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె తెలిపారు. భారత్‌నుంచి టర్కీ లోని ఇస్తాంబుల్ నగరానికి 1100కి.మీ. దూరంలోని టాబ్జాన్‌కి ఇటీవలే 148 మంది భారతీయ విద్యార్థులు, 38 మంది అధికారులు వెళ్లారు. అక్కడ జరగనున్న వరల్డ్ స్కూల్ ఛాంపియన్‌షిప్ పోటీలో పాల్గొనేందుకు వీరు అక్కడికి వెళ్లారు. విద్యార్థుల్లో పదో తరగతి, ఇంటర్మీడియట్ స్థాయికి చెందిన వారున్నారు. వీరందరూ క్షేమమేనని ఆమె పేర్కొన్నారు.