: షాదీ ముబారక్ నిబంధనల్లో మార్పు...ఎమ్మెల్యే ఆమోదం తప్పనిసరి


తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'షాదీ ముబారక్‌' పథకం నిబంధనలను తెలంగాణ ప్రభుత్వం మార్చింది. ఇకపై ఈ పథకం ద్వారా ప్రయోజనాలు పొందాలంటే మాత్రం తహశీల్దారులు తయారు చేసే జాబితాను స్థానిక శాసనసభ్యులు ఆమోదించాలి. లేని పక్షంలో వారికి షాదీ ముబారక్ పథకం దూరమవుతుంది. అంతే కాకుండా ఇంతవరకు షాదీ ముబారక్ పథకంలో లబ్దిదారులకు అధికారులే చెక్కులు అందజేసేవారు. ఇకపై శాసనసభ్యులే ఈ చెక్కులు అందజేయనున్నారు. దీంతో నిబంధనలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ పథకం ముస్లింల ప్రయోజనాల కోసం పెట్టినట్టు లేదని, టీఆర్ఎస్ ప్రయోజనాల కోసం పెట్టినట్టు కనిపిస్తోందని పలువురు పేర్కొంటున్నారు.

  • Loading...

More Telugu News