: ఘజియాబాద్ లో సాహసం...సోషల్ మీడియాలో సంచలన వీడియో
సాహసం, క్రేజ్ పేరుతో యువకులు పిచ్చిపిచ్చి పనులు చేస్తూ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ లో ఏడుగురు యువకులు సాహసాలు చేస్తూ చిత్రీకరించుకున్న వీడియో సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలపాలవుతోంది. యూపీలోని ఘజియాబాద్ స్నేహితులతో బెట్టింగ్ కట్టి, ట్రైన్ వస్తున్న సమయంలో బ్రిడ్జ్ పై నుంచి కిందనున్న నీళ్లలోకి దూకారు. దీనిని వీడియోగా తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. వారు కిందకు దూకడంలో ఏమాత్రం ఆలస్యమైనా, నిండుజీవితాలు బలయ్యే ఇలాంటి పిచ్చి సాహసాలపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి యువకులే భవిష్యత్ లో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ గా తయారయ్యే ప్రమాదం పొంచి ఉందని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.