: రేషన్ కార్డులు తొలగిస్తున్నారన్నది అవాస్తవం: పరిటాల సునీత
'ఈపాస్' విధానంపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత స్పష్టం చేశారు. విజయవాడలో పౌరసరఫరాలశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఈపాస్ విధానం ద్వారా అవినీతిని అంతం చేస్తున్నామని అన్నారు. ఈ విధానం ద్వారా రేషన్ కార్డులు తొలగిస్తారంటూ ప్రతిపక్షాలు చేసే ప్రచారాన్ని నమ్మవద్దని ఆమె ప్రజలకు సూచించారు. రేషన్ దుకాణాలకు వెళ్లలేనివారి కోసం ‘మీ ఇంటికే మీ రేషన్’ పథకం ద్వారా రేషన్ అందజేసే ఏర్పాట్లు చేస్తున్నామని ఆమె తెలిపారు. రేషన్ డీలర్లకు కమిషన్ పెంపుపై కేబినెట్ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆమె వెల్లడించారు.