: మొక్కలు నాటిన టాలీవుడ్ నటుడు సంపూర్ణేష్ బాబు
మెదక్ జిల్లా సంగారెడ్డి వైకుంఠపురంలో ఈరోజు నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో తెలుగు సినీనటుడు సంపూర్ణేష్ బాబు పాల్గొన్నారు. కార్యక్రమంలో అక్కడ రెండు వేల మొక్కలు నాటేందుకు శ్రీకారం చుట్టారు. ఎన్‌సీసీ విద్యార్థులతో కలిసి సంపూర్ణేష్ బాబు మొక్కలు నాటి వాటికి నీరు పోశారు. ఈ సందర్భంగా మంచి కార్యక్రమంలో పాల్గొన్నానని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ‘మొక్కలు నాటే కార్యక్రమంలో అందరూ పాల్గొనడం సంతోషం’ అని సంపూర్ణేష్ బాబు పేర్కొన్నారు. ‘వాతావరణం బాగుంటేనే జీవి మనుగడ బాగుంటుంది’ అని ఆయన వ్యాఖ్యానించారు.