: నైజీరియాలో విశాఖ ఇంజనీర్ కు విముక్తి... 17 రోజుల నిర్బంధం తర్వాత విడిచిపెట్టిన కిడ్నాపర్లు
నైజీరియాలో కిడ్నాప్ నకు గురైన విశాఖపట్నానికి చెందిన ఇంజనీర్ సాయి శ్రీనివాస్ కు ఎట్టకేలకు విముక్తి లభించింది. గత నెలాఖరులో సాయి శ్రీనివాస్ ను నైజీరియన్లు కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఆయన కుటుంబ సభ్యులు ఏసీ సీఎం చంద్రబాబును కలిసి శ్రీనివాస్ ను విడిపించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. చంద్రబాబు వినతితో శ్రీనివాస్ ను విడిపించేందుకు కేంద్ర విదేశాంగ శాఖ చేసిన యత్నాలు ఫలించలేదు. అయితే 17 రోజుల నిర్బంధం తర్వాత ఆయనను కిడ్నాపర్లు వదిలేశారు. ఈ మేరకు కిడ్నాపర్ల నుంచి విడుదలైన వెంటనే ఆయన విశాఖలోని తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తాను క్షేమంగానే ఉన్నట్లు చెప్పాడు. త్వరలోనే ఆయన విశాఖకు రానున్నట్లు సమాచారం.