: వాన్ పిక్ వివాదం వల్లే గుంటూరుకు పరిశ్రమలు రావడం లేదన్న కొల్లు రవీంద్ర
ఏపీలోని గుంటూరు జిల్లాకు పరిశ్రమలు రావడం లేదని ఆ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. గత ప్రభుత్వ హాయంలో పెను వివాదంగా మారిన వాన్ పిక్ కారణంగానే గుంటూరు జిల్లాకు పరిశ్రమలు రావడం లేదని ఆయన కొద్దిసేపటి క్రితం విజయవాడలో వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పాలన సరిగా సాగుతోందని ఆయన అన్నారు.