: టర్కీలో ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, యూట్యూబ్ సైట్లు నిలిపివేత... పునరుద్ధరణ‌


టర్కీ సైన్యంలోని ఓ వ‌ర్గం ఆ దేశ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా చేస్తోన్న తిరుగుబాటు నేప‌థ్యంలో ఆ దేశంలో ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, యూట్యూబ్‌ వంటి సోషల్‌ మీడియా సైట్లను నిన్న రాత్రి 11 గంట‌ల నుంచి నిలిపివేశారు. అయితే, మళ్లీ కొద్ది సేప‌టికే వాటిని పునరుద్ధరించారు. త‌మ సైట్‌ను నిలిపివేయ‌లేద‌ని ట్విట్ట‌ర్ పేర్కొంటే, కొంతసేపు తమ సేవలు డౌన్‌ అయ్యాయని యూ ట్యూబ్ చెప్పింది. ప్ర‌స్తుతం వాటి సేవ‌లు కొన‌సాగుతున్నాయ‌ని స‌ద‌రు సంస్థ‌లు పేర్కొన్నాయి. ట‌ర్కీలో కొన‌సాగుతోన్న సైనిక‌ తిరుగుబాటులో ఇప్ప‌టివ‌ర‌కు 17 మంది పోలీసులు సహా 60 మంది మృతి చెందారు. 754 మంది సైనికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొంద‌రు సైనికులు స్వ‌చ్ఛందంగా లొంగిపోయారు.

  • Loading...

More Telugu News