: అనర్హత వేటు ఎన్నికల కమిషన్ కు ఇవ్వాలని డిమాండ్ చేసిన మేకపాటి


ఒక పార్టీ టికెట్ పై చట్టసభలకు ఎన్నికై మరో పార్టీలోకి చేరే నేతలపై తప్పనిసరిగా వేటు వేయాల్సిందేనని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. నేటి ఉదయం హైదరాబాదులోని వైసీపీ కార్యాలయంలో జరిగిన ఆ పార్టీ పార్లమెంటరీ భేటీ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఆయన ఈ డిమాండ్ చేశారు. అంతేకాకుండా పార్టీ ఫిరాయించిన సభ్యులపై అనర్హత వేటు వేసే అధికారాన్ని ఇకపై ఎన్నికల కమిషన్ కు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News