: మైనర్లకు మద్యం వద్దు... బార్లలో బోర్డులు పెట్టాల్సిందేనంటున్న మంత్రి కొల్లు రవీంద్ర


హైదరాబాదులో మద్యం మత్తులో మైనర్ బాలురు ర్యాష్ డ్రైవింగ్ లో భాగంగా చేసిన యాక్సిడెంట్ లో చిన్నారి రమ్య మరణించిన ఘటన ఏపీ సర్కారును కూడా కదిలించినట్లుంది. ఇకపై ఏపీలోని అన్ని బార్లలో మైనారిటీ తీరని బాలురకు మద్యం విక్రయించరాదని ఆ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు అన్ని బార్లు తప్పనిసరిగా ప్రత్యేకంగా బోర్డులు ఏర్పాటు చేయాలని నేటి ఉదయం విజయవాడలో చెప్పారు.

  • Loading...

More Telugu News