: కృష్ణా నదికి చేరిన గోదావరి జలాలు... పూజలు చేసిన మహిళలు, రైతులు
గోదావరి జలాలు కృష్ణా నదికి చేరాయి. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా మొన్న విడుదల చేసిన గోదావరి జలాలు 182 కిలో మీటర్ల దూరం ప్రయాణించి నేటి ఉదయం విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణానదిలో కలిశాయి. ఈ సందర్భంగా కృష్ణా నదిలో చేరిన గోదావరి జలాలకు కృష్ణా డెల్టాకు చెందిన రైతులు, మహిళలు ప్రత్యేకంగా పూజలు చేశారు.