: ఢిల్లీ చేరిన చంద్రబాబు!... మరికాసేపట్లో అంతర్రాష్ట్ర మండలి సమావేశం!


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన అంతర్రాష్ట్ర మండలి సమావేశం మరికాసేపట్లో దేశ రాజధాని ఢిల్లీలో జరగనుంది. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉన్న ఈ మండలి భేటీకి నిన్న రాత్రికే తెలంగాణ సీఎం కేసీఆర్ సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీ చేరుకున్నారు. ఇక రష్యా పర్యటన ముగించుకుని నిన్న మధ్యాహ్నానికి విజయవాడ చేరుకున్న టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నేటి ఉదయం గన్నవరం ఎయిర్ పోర్టులో ఢిల్లీ ఫ్లైట్ ఎక్కారు. కొద్దిసేపటి క్రితం ఆయన ఢిల్లీలో ల్యాండయ్యారు. రాష్ట్రపతి భవన్ లో మోదీ అధ్యక్షతన కాసేపట్లో ప్రారంభం కానున్న ఈ భేటీకి చంద్రబాబు ఎయిర్ పోర్టు నుంచే నేరుగా బయలుదేరనున్నారు.

  • Loading...

More Telugu News