: హైదరాబాద్ పోలీసులకు చిక్కిన నకిలీ పోలీసు.. రూ.80 వేలు స్వాధీనం


పోలీసు పేరుతో ప్రజలను బురిడీ కొట్టిస్తూ అందినకాడికి దోచుకుంటున్న ఓ నకిలీ పోలీసును హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి రూ.80వేలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. ఫతే దర్వాజాకు చెందిన మహ్మద్ యూనస్(32) పోలీసుగా చెప్పుకుంటూ దోపిడీలకు పాల్పడుతున్నాడు. ఈనెల 5న కాచిగూడలో ఓ ఆటోను ఆపిన యూనస్ తనను తాను పోలీసుగా చెప్పుకుంటూ ప్రయాణికులను సోదా చేశాడు. చత్తీస్ గడ్ కు చెందిన ముగ్గురు బోర్ వెల్ కార్మికుల వద్ద దొరికిన రూ.1.18 లక్షలు తీసుకున్నాడు. వారిని తనతోపాటు పోలీస్ స్టేషన్ కు రావాల్సిందిగా కోరాడు. బాధితులు అతడిని అనుసరిస్తుండగా చాకచక్యంగా వారి నుంచి తప్పించుకుని పరారయ్యాడు. అతడు కనిపించకపోవడంతో బాధితులు తిరిగి చత్తీస్ గఢ్ వెళ్లిపోయారు. శుక్రవారం పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అతడి నుంచి నగదును స్వాధీనం చేసుకున్నట్టు కాచిగూడ ఏఎస్పీ లక్ష్మీనారాయణ తెలిపారు.

  • Loading...

More Telugu News