: టర్కీలో సైనిక తిరుగుబాటు!... దేశాన్ని పూర్తిగా అధీనంలోకి తీసుకున్న సైన్యం!


టర్కీలో సైనిక తిరుగుబాటు చోటుచేసుకుంది. నిన్న రాత్రి తిరుగుబాటు చేసిన సైన్యం దేశం మొత్తాన్ని తన అధీనంలోకి తీసుకుంది. ఈ సందర్భంగా రాజధాని అంకారాపై సైన్యం వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో 17 మంది పోలీసులు చనిపోయారు. ఆ తర్వాత అంకారాలోని పార్లమెంటు భవనంపై బాంబులు కురిపించింది. పార్లమెంటుతో పాటు జాతీయ టీవీ, రేడియో కార్యాలయాలను తన స్వాధీనంలోకి తీసుకుంది. వెనువెంటనే దేశాన్ని తమ అధీనంలోకి తీసుకున్నట్లు ఈ రెండు మాధ్యమాల ద్వారా సైన్యం ప్రకటించింది. దేశంలో నానాటికీ పెరుగుతున్న ఉగ్రవాదం, పాలకుల నిరంకుశత్వం కారణంగానే తిరుగుబాటు చేయాల్సి వచ్చిందని సైన్యం చెప్పింది.

  • Loading...

More Telugu News