: జకీర్ నాయక్ అబద్ధాలు చెబుతున్నారు: వెంకయ్యనాయుడు


ముస్లిం మతానికి సంబంధించిన ఛానల్‌ కావడం వల్లే పీస్‌ టీవీకి అనుమతి నిరాకరించారని వివాదాస్పద మత గురువు జకీర్‌ నాయక్‌ చేసిన ఆరోపణలపై కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి వెంకయ్యనాయుడు స్పందించారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, జకీర్ నాయక్ అబద్ధాలు మాట్లాడుతున్నారని అన్నారు. ఛానెల్స్ విషయంలో భారత ప్రభుత్వం ఏనాడు వివక్ష చూపించలేదని ఆయన చెప్పారు. పీస్‌ టీవీ అనుమతి కోసం 2008లో ఒకసారి, 2009లో రెండోసారి దరఖాస్తు చేసుకుందని అన్నారు. అయితే ఛానెల్ పెట్టాలని భావించినప్పుడు దానికి సంబంధించిన విధివిధానాలు, ఇతర వివరాలను ప్రభుత్వానికి అందజేయాలని ఆయన చెప్పారు. పీస్ టీవీ ఛానెల్ యజమానులు తమ ఛానెల్ కు సంబంధించిన పూర్తి వివరాలు అందించకపోవడంతోనే భారత ప్రభుత్వం అనుమతి నిరాకరించిందని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News