: గడువుకు ముందే పోలవరం ప్రాజక్టు పూర్తి చేస్తాం : చంద్రబాబు
పట్టిసీమను తక్కువ కాల వ్యవధిలోనే పూర్తి చేయడం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఏడాది కాలంలోనే ప్రాజెక్టును పూర్తి చేసి, చరిత్ర సృష్టించామని ఆయన ఆయన అన్నారు. విజయవాడలో ఈరోజు నిర్వహించిన ప్రముఖ ఇంజనీర్ కేఎల్ రావు జయంత్యుత్సవాలలో పాల్గొన్న ఆయన అనంతరం ప్రసంగించారు. పట్టిసీమను పూర్తి చేసిన విధంగానే పోలవరంను కూడా సమర్థవంతంగా పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు.