: కాంగ్రెస్ నేతలతో జైట్లీ భేటీ... జీఎస్‌టీ బిల్లు ఆమోదం విషయంపై చర్చ
ఈనెల 18 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో వస్తుసేవల బిల్లు (జీఎస్‌టీ) ఆమోదం పొందడమే లక్ష్యంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ ఈరోజు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్‌కుమార్‌తో కలిసి పలువురు కాంగ్రెస్ నేతలతో భేటీ అయ్యారు. గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మలతో మాట్లాడిన ఆయన రానున్న సమావేశాల్లో జీఎస్‌టీ బిల్లు ఆమోదం పొందడానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. జైట్లీతో చర్చించిన అనంతరం గులాం నబీ ఆజాద్ మీడియాతో మాట్లాడుతూ.. జీఎస్‌టీ బిల్లుకు సంబంధించి సమగ్రంగా చర్చించామని తెలిపారు. బిల్లు ఆమోదం పొందడానికి తమ పార్టీ నేతలతో చర్చించి ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఆయన చెప్పారు.