: మార్కెట్లో కబాలి స్పెషల్ వెండి నాణాలు... ధర రూ. 350 నుంచి మొదలు


సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం 'కబాలి' విడుదల తేదీ వెల్లడైన తరువాత నుంచి ఆయన అభిమానుల్లో 'కబాలి ఫీవర్' పెరిగిపోయింది. దానికి అనుగుణంగానే నిర్మాతల ప్రమోషన్ కూడా తారస్థాయికి చేరింది. ఇప్పటికే ఓ విమానాన్ని కబాలి పోస్టర్లతో అలంకరించగా, ఎయిర్ టెల్ ఏకంగా ప్రత్యేక సిమ్ ను విడుదల చేసింది. తాజాగా, కేరళ కేంద్రంగా ఆభరణాల వ్యాపారం చేస్తున్న ముతూట్ ఫైనాన్స్ సంస్థ కబాలి వెండి నాణాలను విడుదల చేసింది. 5 గ్రాముల నాణాన్ని రూ. 350కి, 10 గ్రాముల నాణాన్ని రూ. 700కు, 20 గ్రాముల నాణాన్ని రూ. 1400కు అందిస్తామని సంస్థ ప్రకటించింది. వీటిని నేటి నుంచి బుక్ చేసుకోవచ్చని, చిత్రం విడుదల తరువాత డెలివరీ ఇస్తామని వివరించింది. కాగా, ఈ చిత్రం 22న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News