: సీఈవోకు కళ్లు తిరిగే బహుమతినిచ్చిన ఉద్యోగులు!


సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులకు అదనపు జీతాలు, బోనస్, ఇంక్రిమెంట్లు ఇచ్చి వారిని ఆనందంలో యాజమాన్యాలు ముంచెత్తుతాయి. అయితే అమెరికాలోని గ్రేవిటీ కంపెనీ ఉద్యోగులు మాత్రం తమ బాస్ కు కళ్లు తిరిగే బహుమతిని ఇచ్చారు. గ్రేవిట్ కంపెనీ సీఈవో డాన్ ప్రైస్ ను ఆ కంపెనీ ఉద్యోగులు ఎంతగానో అభిమానిస్తారు. దానికి కారణం, కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగులకు ఏడాదికి కనీస జీతం 70 వేల డాలర్లు (46.97 లక్షల రూపాయలు) ఉండేలా చేశాడు. అంతేకాదు, తన వేతనాన్ని 11 లక్షల డాలర్ల నుంచి 70 వేల డాలర్లకు తగ్గించుకుని ఉద్యోగులతో సమానంగా తీసుకుంటూ, తన జీతంలో తగ్గించుకున్న మొత్తాన్ని ఉద్యోగుల జీతాలకు కలిపేశాడు. దీంతో ఆయన ఉదారతకు ముగ్ధులైన గ్రేవిటీ ఉద్యోగులు 120 మంది తమ జీతాల్లో కొంత మొత్తాన్ని సేవ్ చేసి, తమ సీఈవోకు ఆయన కలల కారైన 'టెల్సా'ను బహుమతిగా ఇచ్చారు. ఉద్యోగులకు సీఈవోతో సమానంగా జీతం పెంచడం వ్యాపార వర్గాల్లో చర్చనీయాంశమైతే... ఆ ఉద్యోగులంతా కలిసి సీఈవోకు ఖరీదైన కారును బహుమతి ఇవ్వడం మరింత చర్చనీయమైంది. ఈ ఘటన గురించి తెలిసిన వారంతా బాస్ మంచోడైతే ఉద్యోగులు మరింత మంచోళ్లని పేర్కొంటున్నారు.

  • Loading...

More Telugu News