: ఏలూరు కాలువలో శిశువు మృతదేహం లభ్యం.. నిన్న తప్పిపోయిన శిశువుదే అంటూ ప్రచారం... తమ బిడ్డ కాదన్న తల్లిదండ్రులు!
విజయవాడలోని పాత ప్రభుత్వాసుపత్రిలో నిన్న కలకలం రేగిన సంగతి తెలిసిందే. చికిత్స కోసం తీసుకొచ్చిన ఓ శిశువుని నిన్న గుర్తు తెలియని ఓ మహిళ ఎత్తుకెళ్లింది. అపహరణకు గురయిన శిశువు ఆచూకిని తెలుసుకోవడానికి ఆరు ప్రత్యేక బృందాలు కూడా రంగంలోకి దిగాయి. అయితే కొద్ది సేపటి క్రితం ఏలూరు కాలువలో ఓ మగశిశువు మృతదేహం లభ్యమయింది. ఆ మృతదేహం నిన్న ఆసుపత్రిలో అదృశ్యమైన శిశువుదేనంటూ ప్రచారం జరిగింది. దీంతో అక్కడ మరోసారి అలజడి రేగింది. ఈరోజు కాలువలో లభించిన శిశువు మృతదేహాన్ని నిన్న అపహరణకు గురయిన శిశువు తల్లిదండ్రులు సుబ్రహ్మణ్యం, కల్యాణి పరిశీలించారు. ఆ మృతదేహం అదృశ్యమయిన తమ శిశువుది కాదని తేల్చి చెప్పారు.