: తెలంగాణ సర్కార్‌కి జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు
ఇటీవల హైదరాబాద్‌లోని సరోజనీదేవి కంటి ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించుకున్న రోగుల్లో ఏడుగురు రోగులు కంటిచూపు కోల్పోయిన ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశంపై తమకు నివేదిక ఇవ్వాలని తెలంగాణ సర్కార్‌కి ఈరోజు నోటీసులు జారీ చేసింది. తెలంగాణ సీఎస్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి, సరోజనిదేవి ఆసుపత్రి సూపరింటెండెంట్, డీజీపీలకి ఈ కేసును సుమోటోగా స్వీకరించాలని సూచించింది. దీనిపై రెండు వారాల్లోగా తమకు తుది నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఆసుపత్రిలో ఇటీవల రోగులకు ఆపరేషన్ చేసేముందు సరోజనిదేవి ఆసుపత్రి సిబ్బంది రింగర్స్ లాక్టేట్ (ఆర్‌ఎల్) సెలెన్ వాటర్‌తో కళ్లను శుభ్రం చేశారు. దీనిలో బాక్టీరియా ఉండడంతో 13 మందికి ఇన్‌ఫెక్షన్ సోకింది. వీరిలో ఐదుగురి పరిస్థితి మెరుగుపడగా మరో ఏడుగురి కంటి చూపు దెబ్బతింది.