: నిరాడంబరుడికి లగ్జరీ కారు!...హర్యానా సీఎం ఖట్టర్ కు రూ.1.70 కోట్ల కారు!


బీజేపీలో క్రమశిక్షణ కలిగిన నేతగా హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ కు పేరుంది. పార్టీ ఆదేశాలను ధిక్కరించని తత్వం, నిరాడంబరతలే ఆయనను నేరుగా సీఎం పీఠంపై కూర్చోబెట్టాయి. నిరాడంబరతలో ఆయనకు ఆయనే సాటి. ఇందుకు నిదర్శనంగానే ఆయన... తనకు ముందుగా సీఎంగా పనిచేసిన భూపిందర్ సింగ్ హుడా వాడిన మెర్సిడెజ్ బెంజ్ కారునే ప్రస్తుతం వినియోగిస్తున్నారు. అయితే ఇటీవల ఆయనకు ప్రత్యర్థులు, తీవ్రవాదుల నుంచి ప్రమాదం ఉందని వస్తున్న వార్తలతో హర్యానా సర్కారు ఓ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఏకంగా రూ.1.35 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన టయోటా ల్యాండ్ క్రూయిజర్ వాహనాన్ని, బుల్లెట్ ప్రూఫ్ గా మార్చేందుకు మరో రూ.35 నుంచి 40 లక్షలను సర్కారు వెచ్చిస్తోంది. అంటే... నిరాడంబరతకు నిదర్శనంగా నిలుస్తున్న ఖట్టర్ ఇకపై లగ్జరీకి కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తున్న ల్యాండ్ క్రూయిజర్ లో తిరుగుతారన్న మాట. ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి. ఇప్పటిదాకా హర్యానా సీఎంలుగా పనిచేసిన వారిలోకెల్లా నిరాడంబరుడిగా పేరున్న ఖట్టర్... వారందరిలోకి అత్యంత ఖరీదైన కారు వాడుతున్న సీఎంగానూ రికార్డులకు ఎక్కనున్నారు.

  • Loading...

More Telugu News