: పోలీసులపైకి పెట్రోల్ బాంబులు, వాహనాలపై రాళ్లు!... కశ్మీర్ లో మరింత పేట్రేగిన యువత!
హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది బుర్హాన్ వానీ ఎన్ కౌంటర్ నేపథ్యంలో జమ్ము కశ్మీర్ లో పెచ్చరిల్లిన అల్లర్లు నేడు మరింత తీవ్ర రూపం దాల్చాయి. ఫలితంగా నిన్న కాస్తంత చక్కబడ్డ పరిస్థితులు నేడు మరింత విషమ స్థితిలోకి వెళ్లాయి. రోడ్లపైకి తండోపతండాలుగా వస్తున్న కశ్మీర్ యువత పోలీసులపైకి పెట్రోల్ బాంబులు విసిరింది. భద్రతా దళాల వాహనాలు, ప్రభుత్వ వాహనాలపై రాళ్లు రువ్వింది. ఫలితంగా పోలీసులు మరోమారు కాల్పులకు తెరతీయక తప్పలేదు. వెరసి వరుసగా ఎనిమిదో రోజు కూడా కశ్మీర్ లో కర్ఫ్యూ కొనసాగుతోంది. తాజా అల్లర్లతో అమర్ నాథ్ యాత్రను పోలీసులు రద్దు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొబైల్, ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు.