: ‘గోల్డెన్ మ్యాన్’ దత్తాత్రేయ దారుణ హత్య!


ఇరవై రెండు క్యారెట్ల బంగారంతో తయారు చేయించుకున్న చొక్కాను ధరించి, అన్ని వేళ్లకు ఉంగరాలు, మెడ నిండా బంగారు గొలుసులతో దర్శనమిచ్చే పుణెకు చెందిన ‘గోల్డ్ మ్యాన్’ దత్తాత్రేయ ఫూజ్ (44) సిటీకి సమీపంలోని దిఘీలో హత్యకు గురయ్యారు. నిన్న రాత్రి కొందరు వ్యక్తులు తమ ఇంటికి వచ్చి తన భర్తను తీసుకువెళ్లారని దత్తాత్రేయ భార్య సీమ చెప్పారు. భరతమాతనగర్ కు తీసుకువెళ్లిన వారు తన భర్తపై రాళ్లతో, ఆయుధాలతో దాడి చేసి హతమార్చారని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, మాజీ కార్పొరేటర్ అయిన సీమ ఆరోపించారు. ఈ సంఘటనకు సంబంధించి నలుగురు అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో దత్తాత్రేయ మేనల్లుడు కూడా ఉన్నాడు. కాగా, దత్తాత్రేయ చిట్ ఫండ్ కంపెనీని ఏర్పాటు చేశారని, చాలా మంది ఇన్వెస్టర్ల నుంచి డబ్బు సేకరించారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయని, ఇన్వెస్టర్లతో ఘర్షణ పడిన సందర్భాలు కూడా ఉన్నాయని, ఆయనపై క్రిమినల్ కేసు నమోదయ్యాయని పోలీసులు చెప్పారు.

  • Loading...

More Telugu News