: బంగారం అమ్మి బాంబులు తయారు చేసిన హైదరాబాద్ ఉగ్రవాది


హైదరాబాద్ లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులకు ఇటీవల పట్టుబడ్డ ఐఎస్ ఉగ్రవాదుల విచారణలో పలు ఆసక్తికర విషయాలు బయటపడుతున్నాయి. ప్రస్తుతం ఎన్ఐఏ కస్టడీలో ఉన్న ఇబ్రహీం యాజ్దానీ, ఇలియాజ్ యాజ్దానీ, అతావుల్లా రహ్మాన్, నియామతుల్లా హుసేన్ లను అధికారులు విచారిస్తున్నారు. హైదరాబాద్ లో బాంబు పేలుళ్ల కోసం సిరియాలోని ఐఎస్ నాయకుడి నుంచి డబ్బులు వస్తాయని ఉగ్రవాది ఇబ్రహీం ఆశించినప్పటికీ ఆ సాయం అందలేదు. దీంతో, ఇబ్రహీం తన సొంత బంగారాన్ని అమ్మేసి దాదాపు లక్షన్నర రూపాయలతో బాంబుల తయారీకి అవసరమైన పేలుడు పదార్థాలు, తుపాకులను కొనుగోలు చేశాడని ఎన్ఐఏ అధికారుల విచారణలో తెలిసింది. కాగా, హైదరాబాద్ లో పేలుళ్ల నిమిత్తం ఇబ్రహీం గ్యాంగ్ కు ఇటీవలే సౌదీ అరేబియా నుంచి ఏడువేల రియాల్ లు అందిందని, ఈ కరెన్సీ వారికి ఏ విధంగా చేరిందనే దానిపై ఎన్ఐఏ అధికారులు దృష్టి సారించారు.

  • Loading...

More Telugu News