: హైదరాబాద్ రోడ్డుల తీరు బాలేదు... సీఎం, ప్రజలు అసంతృప్తితో ఉన్నారు: మంత్రి కేటీఆర్


హైదరాబాద్ లో రోడ్ల తీరుపై సీఎం కేసీఆర్ నుంచి సామాన్యుడి వరకు అందరూ అసంతృప్తితో ఉన్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. జీహెచ్ఎంసీ కార్యాలయంలో ‘మై జీహెచ్ఎంసీ యాప్’ను ఈరోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, రోడ్ల తీరుపై తనకు సంతృప్తి లేదని, వాటికి శస్త్ర చికిత్స చేయాల్సిన అవసరముందని అన్నారు. సర్టిఫికెట్ల కోసం అధికారుల చుట్టూ తిరగకుండా ఉండేందుకే ఈ యాప్ ను రూపొందించామని, లంచం ఇవ్వకుండా సర్టిఫికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చని చెప్పారు. ఈ యాప్ త్వరలోనే ఐఫోన్ వెర్షన్ కు అందుబాటులోకి తెస్తామన్నారు. వినియోగదారుల ఫిర్యాదులపై స్పందించేలా మేయర్, కమిషనర్ పర్యవేక్షించాలని కేటీఆర్ ఆదేశించారు.

  • Loading...

More Telugu News